Nagashourya: 'తమ్ముడు బ్రహ్మాజీ'ని ఎంకరేజ్ చేయమంటున్న నాగశౌర్య!

Nagashourya funny comment on Brahmaji

  • అనీష్ కృష్ణతో నాగశౌర్య
  • రీసెంట్ గా సెట్స్ పైకి
  • కొత్త కథానాయిక పరిచయం
  • ముఖ్యమైన పాత్రలో బ్రహ్మాజీ

నాగశౌర్య కథానాయకుడిగా ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి అనీష్ కృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాతో షెర్లీ సెటియా కథానాయికగా పరిచయమవుతోంది. ఒక ముఖ్యమైన పాత్రలో బ్రహ్మాజీ నటిస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి హైదరాబాదులో ఈ సినిమా షూటింగు ఏకధాటిగా జరుగుతోంది. నాగశౌర్య .. బ్రహ్మాజీ తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ షూటింగు సమయంలో తీసిన ఒక ఫొటోను నాగశౌర్య ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. నాగశౌర్య నుదుటున కుంకుమరేఖను ధరించి కనిపిస్తూ ఉండగా, బ్రహ్మాజీ నుదుటున నామాలు ధరించి ఉన్నాడు. బహుశా ఏదైనా పండగకు .. పూజకు సంబంధించిన సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ ఉండవచ్చు. ఆ షూటింగు గ్యాపులో ఈ ఫొటోను తీశారు. అయితే ఈ ఫొటోను పోస్ట్ చేసిన నాగశౌర్య ఫన్నీగా ఒక కామెంట్ పెట్టాడు.

"నా తమ్ముడు బ్రహ్మాజీ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాడు .. మీ అందరి సపోర్టు కావాలి .. దయచేసి యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించండి" అంటూ సరదాగా రాసుకొచ్చాడు. బ్రహ్మాజీ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అయింది. అయినా ఆయన ఇప్పటికీ కుర్రాడిలా చాలా ఫిట్ నెస్ తో ఉంటాడు. ఈ విషయంపై సన్నిహితులు ఆయనను ఆటపట్టిస్తూనే ఉంటారు. అలాగే నాగశౌర్య కూడా, ఆయనను తమ్ముడు అంటూ అలా సందడి చేసి ఉంటాడు.  

Nagashourya
Brahmaji
Anish Krishna
  • Loading...

More Telugu News