: రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి: బాలకృష్ణ
భగవంతుడి ఆశీస్సులు రాష్ట్రప్రజలపై ఉండాలని, అందరూ సుఖ, సంతోషాలతో ఉండాలని సినీనటుడు బాలకృష్ణ దేవుణ్ణి ప్రార్థించారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో శ్రీరామలింగేశ్వరస్వామి తృతీయ బ్రహ్మోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయిన బాలయ్యబాబు చండీయాగం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉత్సవాలను కంచర్ల భూపాల్ రెడ్డి నిర్వహించగా, టీడీపీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్ రావు, ఉమామాధవరెడ్డి లతో పాటు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.