Pooja Hegde: కరోనా నుంచి కోలుకున్న తర్వాత వ్యాక్సిన్ తొలి డోస్ వేయించుకున్న పూజ హెగ్డే

Pooja Heggde gets her vaccine first shot
  • ఈ ఏడాది కరోనా బారిన పడిన పూజ
  • తొలి టీకాను రెండేళ్ల వయసులో వేయించుకున్నానన్న కన్నడ భామ
  • సోషల్ మీడియాలో ఫొటోలను పంచుకున్న వైనం
సినీ నటి పూజ హెగ్డే కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె పంచుకుంది. వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫోటోను షేర్ చేసింది. తన రెండేళ్ల వయసులో తొలిసారి టీకా వేయించుకున్నానని ... అప్పుడు తనతో పాటు తన తల్లి (లతా హెగ్డే) ఉందని చెప్పింది. మరో ఫొటోకు క్యాప్షన్ గా... 'భయాన్ని చిరునవ్వుతో కప్పిపుచ్చుకున్నప్పుడు' అని పేర్కొంది. ఈ ఏడాది పూజ హెగ్డే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. పాజిటివ్ గా నిర్ధారణ అయిన వెంటనే ఆమె ఐసొలేషన్ కు వెళ్లిపోయింది. కరోనాకు చికిత్స తీసుకుని ఆమె పూర్తిగా కోలుకుంది.

మరోవైపు చేతినిండా సినిమాలతో పూజ హెగ్డే చాలా బిజీగా ఉంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా 'రాధే శ్యామ్'లో ఆమె నటిస్తోంది. దీంతో పాటు అక్కినేని అఖిల్ సరసన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', చిరంజీవి 'ఆచార్య', బాలీవుడ్ మూవీ 'సర్కస్' చిత్రాల్లో పూజ నటిస్తోంది.
Pooja Hegde
Tollywood
Bollywood
Corona Vaccine

More Telugu News