CM KCR: బోనాల ఉత్సవాలకు రావాలంటూ సీఎం కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక అందించిన మంత్రి తలసాని

Talasani invites CM KCR to Ujjaini Mahankali Bonalu
  • హైదరాబాదులో బోనాల సీజన్
  • గత కొన్ని వారాలుగా బోనాలు
  • భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న ప్రజలు
  • త్వరలో ఉజ్జయిని మహంకాళి బోనాలు
భాగ్యనగరంలో బోనాల సీజన్ నడుస్తోంది. గత కొన్నివారాలుగా బోనాల పండుగను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు హాజరు కావాలంటూ సీఎం కేసీఆర్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానించారు. ఉజ్జయిని మహంకాళి దేవస్థానం తరఫున సీఎంకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో ఉజ్జయిని మహంకాళి ఆలయ కమిటీ చైర్మన్ సురిటి కామేశ్వర్, అసిస్టెంట్ కమిషనర్ గుత్తా మనోహర్ రెడ్డి, ఆలయ అర్చకులు ఉన్నారు.
CM KCR
Talasani
Ujjaini Mahankali Bonalu
Invitation
Hyderabad
Telangana

More Telugu News