Intelligence Agencies: దేశ రాజధానిలో భారీ ఉగ్రదాడి జరగొచ్చని ఢిల్లీ పోలీసులకు నిఘా వర్గాల హెచ్చరిక

Intelligence agencies warns Delhi Police possible terror attacks
  • మరికొన్నిరోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవం
  • పోలీసులను అప్రమత్తం చేసిన నిఘా వర్గాలు
  • ఢిల్లీపై డ్రోన్లతో దాడి జరగొచ్చని వెల్లడి
  • ఆగస్టు 15కి ముందే దాడి చేయొచ్చని హెచ్చరిక

స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో కేంద్ర నిఘా వర్గాలు కీలక హెచ్చరికలు చేశాయి. దేశ రాజధానిలో భారీ ఉగ్రదాడి జరగొచ్చని ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశాయి. డ్రోన్ల సాయంతో ఢిల్లీపై విరుచుకుపడేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్టు నిఘా సంస్థలు తెలిపాయి. ఆగస్టు 15కి ముందే దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని వివరించాయి.

ఇటీవల కశ్మీర్ సరిహద్దుల్లో గుర్తుతెలియని డ్రోన్ల సంచారం అధికమైంది. జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్థావరం వద్ద డ్రోన్ దాడి తీవ్ర కలకలం రేపింది. దాంతో కేంద్రం సరిహద్దు ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలను మోహరించింది.

  • Loading...

More Telugu News