మాస్ ఆడియన్స్ కి పండగే .. మరోసారి పూరితో బాలయ్య!
- షూటింగు దశలో 'అఖండ'
- లైన్లో గోపీచంద్ మలినేని
- అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్
- మరోసారి పూరి జగన్నాథ్ తో
బాలకృష్ణ - పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఇంతకుముందు 'పైసా వసూల్' సినిమా వచ్చింది. బాలయ్య మాస్ అభిమానులను ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది. ఆ సినిమాలో బాలకృష్ణ లుక్ కి మంచి మార్కులు పడిపోయాయి. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు ఈ కాంబినేషన్లో ఒక ప్రాజెక్టు సెట్ కానున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ దిశగా సన్నాహాలు మరింత ముందుకు వెళుతున్నాయని టాక్ బలంగా వినిపిస్తోంది. బోయపాటితో 'అఖండ' తరువాత గోపీచంద్ .. అనిల్ రావిపూడి సినిమాలు బాలయ్య చేయనున్నారు. ఆ తరువాత పూరి సినిమా ఉంటుందని అంటున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్లోనూ ఒక సినిమాను చేయడానికి ఆయన అంగీకరించడం విశేషం.