kokapeta: ఎట్టకేలకు కోకాపేట చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. పార్టీ జెండా పాతి ఆందోళన!
- ఇటీవల భూముల వేలం
- అవినీతి జరిగిందని ఆరోపణ
- పోలీసులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదంతో తోపులాట
- పలువురి అరెస్టు
రంగారెడ్డి జిల్లా కోకాపేటలో తెలంగాణ ప్రభుత్వం వేలం వేసిన భూములను సందర్శించి, ధర్నా చేయాలని కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే పోలీసులు ఆ పార్టీ నేతలను గృహనిర్బంధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కొందరు నేతలు ఎట్టకేలకు కోకాపేట భూముల వద్దకు చేరుకుని అక్కడ తమ పార్టీ జెండాను పాతారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ భూముల వేలంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చోటు చేసుకుంది. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, పీసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కోదండరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.