Mumbai: దుబాయ్-ముంబై విమానంలో బాంబు ఉందంటూ ఫోన్ కాల్.. పోలీసుల ఉరుకులు పరుగులు!

Bomb threat on Dubai Mumbai flight turns out to be hoax call
  • విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు
  • ఫేక్ ఫోన్‌కాల్‌గా గుర్తింపు
  • ఆగంతకుడి కోసం గాలింపు
దుబాయ్-ముంబై విమానంలో బాంబు పెట్టామన్న ఆగంతకుడి ఫోన్‌కాల్‌తో అప్రమత్తమైన పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ ఘటనతో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. విమానంలో ఆర్డీఎక్స్ పెట్టామంటూ నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో ఫోన్ రావడంతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేసి విమానంలో సోదాలు నిర్వహించారు.

చివరికి అందులో అనుమానాస్పద వస్తువులేవీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. దర్యాప్తులో దీన్ని ఆకతాయి వ్యక్తి చేసిన ఫేక్ ఫోన్‌కాల్‌గా గుర్తించి అతడి కోసం గాలిస్తున్నారు. 
Mumbai
Dubai
Flight
Hoax Call

More Telugu News