గుజరాత్ హైకోర్టు లైవ్ స్ట్రీమింగ్ ను ఈరోజు ప్రారంభించనున్న సీజేఐ ఎన్వీ రమణ
- సాయంత్రం 5.30 గంటలకు లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభం
- కార్యక్రమానికి అతిథులుగా జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా
- 2020 అక్టోబరులో ప్రయోగాత్మంగా స్ట్రీమింగ్ ను ప్రారంభించిన హైకోర్టు
2020 అక్టోబరులో లైవ్ స్ట్రీమింగ్ ను గుజరాత్ హైకోర్టు ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రయోగాత్మక కార్యక్రమం కొనసాగుతోంది. ఆ కార్యక్రమం దాదాపు 8 నెలలకు పైగా విజయవంతంగా కొనసాగింది. గుజరాత్ హైకోర్టు అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ అయిన వాదనలకు 41 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ యూట్యూబ్ ఛానల్ కు 65 వేలకు పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు.