VK Paul: ప్రపంచం థర్డ్ వేవ్ దిశగా వెళుతోంది... ఇది కాదనలేని వాస్తవం: వీకే పాల్

VK Paul said World rallies towards corona third wave
  • రానున్న మూడు, నాలుగు నెలలు కీలకమన్న పాల్
  • ప్రపంచ దేశాల్లో కరోనా పుంజుకుంటోందని వెల్లడి
  • భారత్ లో హెర్డ్ ఇమ్యూనిటీ రాలేదని వివరణ
  • కరోనా వ్యాప్తి కొనసాగుతోందని వ్యాఖ్యలు
భారత్ లో కరోనా పరిస్థితులపై నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చెబుతూ, రానున్న మూడు, నాలుగు నెలలు ఎంతో కీలకం అని అన్నారు. ప్రపంచం కరోనా థర్డ్ వేవ్ దిశగా వెళుతోందని, ఇది కాదనలేని వాస్తవం అని వ్యాఖ్యానించారు. అమెరికా మినహా మిగతా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని వీకే పాల్ వివరించారు.

భారత్ లో ఇప్పటివరకు హెర్డ్ ఇమ్యూనిటీ రాలేదని, కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉందని వెల్లడించారు. దేశంలో కొవిడ్ థర్డ్ వేవ్ రాకుండా చూడాలన్న లక్ష్యం దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. టీకా రెండు డోసులు తీసుకున్న వారిలో 95 శాతం మరణాలు తగ్గాయని వీకే పాల్ అన్నారు.
VK Paul
Corona Virus
Third Wave
World
India

More Telugu News