Sajjala Ramakrishna Reddy: కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌ నోటిఫికేషన్లు విడుద‌ల‌.. స్పందించిన స‌జ్జ‌ల‌

sajjala slams telangana govt
  • కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి ఖరారు
  • గెజిట్‌ నోటిఫికేషన్‌ను స్వాగతిస్తున్నామ‌న్న స‌జ్జ‌ల‌
  • న్యాయం ఏపీ వైపు ఉందని వ్యాఖ్య‌
  • విద్యుత్‌ ఉత్పత్తి కోసం నీళ్లను విచ్చ‌ల‌విడిగా వ‌దిలార‌ని ఆరోప‌ణ
గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల విష‌యంలో జల వివాదాలు రాజుకుంటోన్న విష‌యం తెలిసిందే. దీంతో ఏడేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గ‌త‌ అర్ధరాత్రి కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేర‌కు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాల‌కు ప‌లు సూచ‌న‌లు చేసింది.  

దీనిపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను స్వాగతిస్తున్నామ‌ని చెప్పారు. నదీ జలాల విషయంలో న్యాయం ఏపీ వైపు ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన సమయంలోనే బోర్డుల పరిధిని నిర్ణయిస్తే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయ్యేది కాదని వ్యాఖ్యానించారు. విద్యుత్‌ ఉత్పత్తి కోసం నీళ్లను విచ్చ‌ల‌విడిగా వ‌దిలార‌ని ఆయ‌న ఆరోపించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రయోజనాలకు తెలంగాణ ప్రభుత్వం గండి కొట్టిందని ఆయ‌న చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముందునుంచీ సంయమనం పాటించిందని చెప్పుకొచ్చారు.
Sajjala Ramakrishna Reddy
YSRCP
Andhra Pradesh
Telangana

More Telugu News