: మందు పాతర పేలి జవాను మృతి
ప్రమాదవశాత్తు మందుపాతర పేలి ఓ జవాను అసువులుబాయగా, మరో జవాను తీవ్రంగా గాయపడ్డాడు. జమ్మూ కాశ్మీర్ లో పూంచ్ జిల్లా కృష్ణా సెక్టార్ వద్ద చొరబాటుదార్ల కోసం అమర్చిన ల్యాండ్ మైన్ పేలి నరేష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా మరో జవాను తీవ్రగాయాలతో బయటపడినట్టు ఆర్మీ అధికారి తెలిపారు. నరేష్ కుమార్ మృతదేహాన్ని హర్యానాలోని అతని స్వస్థలానికి పంపినట్టు అధికారులు తెలిపారు.