డిగ్రీ కాలేజీలలో ప్రవేశాలకు.. ‘దోస్త్’ రిజిస్ట్రేషన్ గడువును పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- నిన్నటితో ముగిసిన ‘దోస్త్’ రిజిస్ట్రేషన్ గడువు
- పలు కారణాలతో తగ్గిన రిజిస్ట్రేషన్లు
- 24 వరకు రిజిస్ట్రేషన్ల గడువును పొడిగించిన ప్రభుత్వం
- ఈ నెల 31 నుంచి తొలి విడత సీట్ల కేటాయింపు
అనంతరం ఆగస్టు 1వ తేదీ నుంచి 9 వరకు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది. విద్యార్థులు 2వ తేదీ నుంచి 9 వరకు వెబ్ అప్లికేషన్లు ఇచ్చుకోవచ్చని అధికారులు తెలిపారు. స్పెషల్ కేటగిరీ (దివ్యాంగులు, ఆర్మీ పిల్లలు, ఎన్‌సీసీ తదితర) విద్యార్థులు ఆగస్టు 6న ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తిచేయించుకోవాలని, ఆగస్టు 14 నుంచి రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు.