Rajamouli: ఆసక్తిని పెంచుతున్న 'ఆర్ఆర్ఆర్' మేకింగ్ వీడియో!

 Making video released from RRR movie
  • ముగింపు దశలో 'ఆర్ఆర్ఆర్'
  • ఆసక్తిని పెంచుతున్న అంశాలు
  • హైలైట్ గా నిలవనున్న యాక్షన్ సీన్స్
  • దసరాకి భారీస్థాయి విడుదల
రాజమౌళి సినిమా అంటే అద్భుతమైన దృశ్యాల సమాహారంలా ఉంటుంది. కథను అల్లుకునే తీరు .. ఆ కథను ఆవిష్కరించే విధానం .. కథనాన్ని నడిపించే తీరు ఉత్కంఠభరితంగా ఉంటాయి. అందువలన ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. అలాంటి ఆయన ఈ సారి ఎన్టీఆర్ - చరణ్ ప్రధాన కథానాయకులుగా, పవర్ఫుల్ పాత్రలలో పరిచయం చేస్తూ 'ఆర్ ఆర్ ఆర్' రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.

రాజమౌళి ఆయా సన్నివేశాలకు సంబంధించి ఆర్టిస్టులకు సీన్స్ ను వివరించడం .. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ .. గ్రాఫిక్స్ కి సంబంధించిన వారితో చర్చించడం .. ఆర్ట్ డైరెక్టర్ తో కలిసి సెట్స్ నమూనాలను పరిశీలించడం .. చేయనున్న సీన్స్ గురించి  కెమెరామెన్ తో మాట్లాడటం .. గ్రాఫిక్స్ కి సంబంధించిన షాట్లను పరిశీలించడం వంటి అంశాలపై కట్ చేసిన మేకింగ్ వీడియో చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. ఈ సినిమా కోసం రాజమౌళి పడుతున్న కష్టానికి ఇది అద్దం పడుతుంది. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 13వ తేదీన రావడం ఖాయమేననేది వీడియో చివరిలో మరోసారి స్పష్టం చేశారు.
Rajamouli
Ntr
Charan
Keeravani

More Telugu News