Musi Project: నిండు కుండలా మూసీ ప్రాజెక్టు.. ఏడు గేట్లు ఎత్తివేత

Musi project gates lifted
  • పూర్తి స్థాయికి చేరుకున్న మూసీ ప్రాజెక్టు నీటిమట్టం
  • ఏడు గేట్లను అడుగు మేర ఎత్తిన అధికారులు
  • ప్రాజెక్టు ఇన్ ఫ్లో 5,500 క్యూసెక్కులు
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో, ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. దీంతో, ఏడు గేట్లను అడుగు మేర ఎత్తివేసి, నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ భాస్కరన్ మాట్లాడుతూ, ప్రాజెక్టు గేట్లను ఎత్తి వేయడం వల్ల మూసీ నదిలో ప్రవాహం పెరిగిందని, దీనివల్ల నది పరీవాహక గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నదిలోకి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 5,500 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో 4,400 క్యూసెక్కులుగా ఉంది.

Musi Project
Water Level
Musi River
Flood

More Telugu News