వైద్యురాలి స్నానాల గదిలో స్పై కెమెరా పెట్టిన న్యూరాలజిస్ట్

  • ముంబైలోని ఓ మెడికల్ కాలేజీలో ట్రైనీగా పనిచేస్తున్న వైద్యురాలు
  • ఆమె బాత్రూమ్, బెడ్రూములలో రహస్యంగా కెమెరాలు పెట్టిన వైద్యుడు
  • బాత్రూములోని లైటు వెలగకపోవడంతో వెలుగులోకి
వైద్యురాలు నివసిస్తున్న ఇంట్లోని స్నానాల గది, పడకగదిలో స్పై కెమెరాలు పెట్టాడో వైద్యుడు. ముంబైలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఓ మెడికల్ కాలేజీలో ఓ వైద్యురాలు ట్రైనీగా పనిచేస్తూ రెసిడెన్షియల్ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. ఇటీవల ఆమె స్నానాలగదిలోని లైటు వెలగకపోవడంతో మరమ్మతు కోసం ఎలక్ట్రీషియన్‌ను పిలిపించారు.

అతడొచ్చి బాగుచేస్తున్న క్రమంలో అందులోంచి స్పై కెమెరా బయటపడింది. దీంతో అప్రమత్తమైన వైద్యురాలు ఇంట్లో ఇంకెక్కడెక్కడ ఉన్నాయో పరిశీలించగా పడకగదిలో మరోటి కనిపించింది. దీంతో విస్తుపోయిన ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అదే మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న 42 ఏళ్ల న్యూరాలజిస్ట్ ఈ దారుణానికి పాల్పడినట్టు తేల్చి అదుపులోకి తీసుకున్నారు.

Mumbai
Medical college
Spy Camera

More Telugu News