Telangana: సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ భేటీ ప్రారంభం

Telangana Cabinet meet starts
  • ప్రగతి భవన్ లో సమావేశం
  • నూతన జోనల్ విధానానికి తొలగిన అడ్డంకులు
  • ఇటీవలే రాష్ట్రపతి ఆమోదం
  • రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీకి సీఎం ఆదేశాలు
ఇటీవల జోనల్ విధానానికి అడ్డంకులు తొలగిపోయిన నేపథ్యంలో రాష్ట్రంలో వేలాది ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో సరికొత్త జోనల్ విధానానికి కొన్నిరోజుల కిందట రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దాంతో తెలంగాణలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ అంశమే ప్రధాన అజెండాగా ఇవాళ తెలంగాణ క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి మండలి సభ్యులు ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. కాగా, ఈ భేటీలో ఏపీతో జలవివాదాలు, వ్యవసాయ సీజన్, పల్లె, పట్టణ ప్రగతి అంశాలను కూడా చర్చించనున్నారు.
Telangana
Cabinet Meet
CM KCR
Zonal System
Recruitment

More Telugu News