Jagan: రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న జగన్

Jagan to visit Polavaram tomorrow
  • ఉదయం 10 గంటలకు హెలికాప్టర్ లో బయల్దేరనున్న జగన్
  • పనుల పురోగతిని పరిశీలించనున్న సీఎం
  • అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి రోడ్డు మార్గంలో హెలీప్యాడ్ కు జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో పోలవరంకు పయనమవుతారు. 11.10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. 1.20 గంటలకు పోలవరం నుంచి తిరుగుపయనమవుతారు.
Jagan
YSRCP
Polavaram Project

More Telugu News