Pakistan: యూపీలో అల్‌ఖైదా అనుబంధ సంస్థ ఉగ్రవాదుల అరెస్ట్.. అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం

Dont Trust UP Cops Akhilesh Yadav Remark On Terror Arrests
  • ఆగస్టు 15న యూపీలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర
  • యూపీ పోలీసులపై తనకు నమ్మకం లేదన్న అఖిలేశ్
  • పాకిస్థాన్ ప్రభుత్వంపై నమ్మకం ఉందా? అని ప్రశ్నించిన బీజేపీ
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో శివారులో ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను ఆదివారం యూపీ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 15న వీరు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల అరెస్ట్‌పై యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీప్ అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.

ఉత్తరప్రదేశ్ పోలీసులపైనా, బీజేపీ ప్రభుత్వంపైనా తనకు నమ్మకం లేదని అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక్కడి ప్రభుత్వంపై కాకుండా పాకిస్థాన్ ప్రభుత్వం, అక్కడి ఉగ్రవాదులపై మీకు నమ్మకం ఉందా? అని బీజేపీ నేత సీటీ రవి ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం లేని ఓ వ్యక్తి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని అమిత్ మాలవీయ తూర్పారబట్టారు.

బీజేపీ విమర్శలపై స్పందించిన ఎస్పీ.. యూపీ పోలీసులపై తనకు నమ్మకం లేదంటూ అఖిలేశ్ మాట్లాడే సమయానికి ఉగ్రవాదులను అరెస్ట్ చేయలేదని పేర్కొంది. అఖిలేశ్‌కు చెడ్డపేరు తీసుకొచ్చేందుకు ఎడిట్ చేసిన క్లిప్‌ను బీజేపీ సర్క్యులేట్ చేస్తోందని మండిపడ్డారు. మరోవైపు, మాయావతి కూడా ఉగ్రవాదుల అరెస్ట్‌పై స్పందించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఈ అరెస్ట్‌లు అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయని బీఎస్పీ చీఫ్ ఆరోపించారు.
Pakistan
Uttar Pradesh
Akhilesh Yadav
Terrorists

More Telugu News