Warangal Rural District: వరంగల్ అర్బన్, గ్రామీణ జిల్లాల పేరు మార్పుపై నోటిఫికేషన్ జారీ

Notification issued on Warangal Urban and Rural districts name changes
  • వరంగల్ అర్బన్ జిల్లా ఇక హన్మకొండ జిల్లా
  • వరంగల్ రూరల్ ఇక వరంగల్ జిల్లా
  • హన్మకొండ జిల్లాలో 12 మండలాలు
  • వరంగల్ జిల్లాలో 15 మండలాలు
  • అభ్యంతరాలకు నెల గడువు
వరంగల్ అర్బన్ జిల్లా ఇకపై హన్మకొండ జిల్లా గానూ, వరంగల్ రూరల్ జిల్లా ఇకపై వరంగల్ జిల్లాగానూ మార్చుతున్నట్టు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ ప్రకటనను అనుసరించి ఇవాళ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ జారీ అయింది. హన్మకొండ జిల్లాలో హన్మకొండ, పరకాల డివిజన్లు ఉంటాయని, మొత్తం 12 మండలాలు ఈ జిల్లా పరిధిలోకి రానున్నాయని ప్రభుత్వం పేర్కొంది. వరంగల్ వెస్ట్ నియోజకవర్గాన్ని హన్మకొండ జిల్లా కేంద్రంగా పరిగణిస్తారని వివరించింది.

ఇక వరంగల్ జిల్లాలో మొత్తం 15 మండలాలు ఉంటాయని నోటిఫికేషన్ లో తెలిపారు. జిల్లాల పేరు మార్పుపై ఎవరికైనా అభ్యంతరాలు, వినతులు ఉంటే తెలియజేసేందుకు నెల రోజుల సమయం ఇస్తున్నట్టు నోటిఫికేషన్ లో తెలిపారు.
Warangal Rural District
Warangal District
Warangal Urban District
Hanmakonda District
Names
Notification
Telangana

More Telugu News