Ram: కృతి శెట్టితో కలిసి రంగంలోకి దిగిన రామ్

Ram new movie shooting started
  • రామ్ 19వ సినిమా మొదలు
  • కథానాయికగా కృతి శెట్టి  
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ 
  • తెలుగు .. తమిళ భాషల్లో విడుదల 
రామ్ కథానాయకుడిగా లింగుసామి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా, కొన్ని రోజులుగా తొలి షెడ్యూల్ కి సంబంధించిన సన్నాహాలను చేసుకుంటూ వస్తోంది. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ఈ రోజున మొదలైంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా అధికారికంగా రిలీజ్ చేశారు. తొలి షెడ్యూల్ లోనే హీరో హీరోయిన్ ఇద్దరిపై సీన్స్ ప్లాన్ చేయడం విశేషం. ఇలా చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది.రామ్ కి ఇది 19వ సినిమా .. కథాకథనాల విషయంలో ఆయన చాలా కేర్ తీసుకునే పట్టాలపైకి వచ్చాడని అంటున్నారు. ఈ మధ్య రామ్ చేసిన 'రెడ్' ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో ఆయన ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడని అంటున్నారు. రామ్ జోడీగా కృతి శెట్టి అనగానే, యూత్ లో ఆసక్తి పెరిగింది. ఈ జోడీని తెరపై చూడాలనే ఆసక్తి అందరిలో ఎక్కువైంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News

Ram
Kruthi Shetty
Lingu Samy