Chandrababu: పీఆర్ మోహన్ కు నివాళులు అర్పించేందుకు శ్రీకాళహస్తి వెళ్లిన చంద్రబాబు

Chandrababu pays tributes to party leader PR Mohan
  • టీడీపీ నేత పీఆర్ మోహన్ హఠాన్మరణం
  • శ్రీకాళహస్తిలో గుండెపోటుతో మృతి
  • దిగ్భ్రాంతికి గురైన చంద్రబాబు
  • మోహన్ భౌతికకాయానికి నివాళులు
టీడీపీ నేత, ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ ఇవాళ గుండెపోటుతో మరణించారు. ఆయన మృతితో టీడీపీ వర్గాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. పీఆర్ మోహన్ తో ఎంతో అనుబంధం ఉన్న చంద్రబాబు... పార్టీ సహచరుడికి నివాళులు అర్పించేందుకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వెళ్లారు. దీనిపై ఆయన ట్విట్టర్ లో స్పందించారు.

పీఆర్ మోహన్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆయనకు, తనకు మధ్య ఎంతో ఆత్మీయ అనుబంధం ఉందని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. అందుకే ఆయన కడసారి చూపు కోసం శ్రీకాళహస్తి వెళ్లానని తెలిపారు. మోహన్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పానని వివరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా చంద్రబాబు పంచుకున్నారు.
Chandrababu
PR Mohan
Tributes
Srikalahasti
Chittoor District
TDP
Andhra Pradesh

More Telugu News