Venkaiah Naidu: బోనాల పండుగ ప్రజల ఐకమత్యానికి ప్రతీక: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Vice president Venkaiah Naidu convey Bonalu wishes to Telangana people

  • నేటి నుంచి బోనాలు
  • తెలంగాణకు పండుగ శోభ
  • తెలంగాణ ప్రజలకు వెంకయ్య శుభాకాంక్షలు
  • కరోనా మార్గదర్శకాలు పాటించాలని సూచన

తెలంగాణలో ఆషాఢం బోనాల శోభ సంతరించుకుంది. దీనిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులు ప్రబలకుండా, ఇతర సమస్యలు దరిచేరకుండా అమ్మవారిని ప్రార్థించే ఈ బోనాల పండుగ... ప్రజల ఐకమత్యానికి ప్రతీక అని అభివర్ణించారు. బోనాల పండుగ సందర్భంగా కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు, నిపుణులు సూచించిన నిబంధనలను పాటిస్తూ, ఆరోగ్య భారత నిర్మాణంలో మనమంతా భాగస్వాములమవుదాం అని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

Venkaiah Naidu
Bonalu
Telangana
Vice President
Corona Pandemic
  • Loading...

More Telugu News