Jagan: జ‌గ‌న్‌కు ప్ర‌కాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల లేఖ‌

tdp mlas write letter to jagan
  • రాయలసీమ ఎత్తిపోతల పథకం విస్తరణ పనులపై అసంతృప్తి
  • పోతిరెడ్డిపాడు సామ‌ర్థ్యం పెంపుతో జిల్లాకు న‌ష్ట‌మ‌ని వ్యాఖ్య‌
  • తెలంగాణ‌, రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల వ‌ద్ద‌ని లేఖ
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌కు ప్ర‌కాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం విస్తరణ పనులపై వారు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. పోతిరెడ్డిపాడు సామ‌ర్థ్యం 40 నుంచి 80 వేల క్యూసెక్కుల‌కు పెంచుతుండ‌డం ప‌ట్ల టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజ‌నేయస్వామి, ఏలూరి సాంబశివరావులు ఈ లేఖలో అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు.

తెలంగాణ‌, రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల వ‌ల్ల త‌మ జిల్లాకు న‌ష్టం క‌లుగుతోంద‌ని, ఆ ప్రాజెక్టుల‌ను నిలిపేయాలని కోరారు. ఎత్తిపోతల పథకాన్ని విస్తరించడం వల్ల ప్రకాశం జిల్లాకు నీరు అందదని తెలిపారు. ఈ ప్రాంత వాసులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు.

Jagan
Telugudesam
YSRCP

More Telugu News