మళ్లీ పట్టాలెక్కుతున్న విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్
- ఈ నెల 15 నుంచి మళ్లీ సేవలు ప్రారంభం
- సాయంత్రం 6.40 గంటలకు విశాఖలో బయలుదేరనున్న రైలు
- తర్వాతి రోజు ఉదయం 7.25 గంటలకు కాచిగూడ రాక
గురువారం సాయంత్రం 6.40 గంటలకు రైలు విశాఖలో బయలుదేరి శుక్రవారం ఉదయం 7.25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. 16న సాయంత్రం 6.25 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, మల్కాజిగిరిలలో ఆగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు.