Narendra Modi: వియత్నాం నూతన ప్రధానికి మోదీ శుభాకాంక్షలు

PM Modi wishes Vietnam newly elected prime minister Pham Chinh Minh
  • వియత్నాం కొత్త ప్రధానిగా మిన్ చిన్
  • ఫోన్ లో మాట్లాడిన ప్రధాని మోదీ
  • ఇరు దేశాల భాగస్వామ్యంపై నమ్మకం
  • చిన్ మిన్ మరింత ముందుకు తీసుకెళతారన్న మోదీ
తూర్పు ఆసియా దేశం వియత్నాం ప్రధానిగా ఫామ్ చిన్ మిన్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ వియత్నాం నూతన ప్రధాని చిన్ మిన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫోన్ లో మాట్లాడిన మోదీ... భారతదేశ పర్యటనకు రావాలంటూ చిన్ మిన్ కు ఆహ్వానం పలికారు. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. వియత్నాం కరోనా సెకండ్ వేవ్ కష్టకాలంలో భారత్ కు మద్దతుగా నిలిచిందని కొనియాడారు.

హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్, వియత్నాం దృక్పథాలు ఒక్కటేనని, ఆమోదయోగ్యమైన షరతులతో కూడిన సార్వత్రిక, శాంతియుత విధానాన్ని ఇరుదేశాలు పాటిస్తున్నాయని తెలిపారు. ప్రాంతీయ అభివృద్ధికి, సుస్థిరతకు, సమగ్ర సంక్షేమానికి భారత్-వియత్నాం వ్యూహాత్మక భాగస్వామ్యం దోహదపడుతుందని భావిస్తున్నట్టు ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
Narendra Modi
Pham Chinh Minh
Prime Minister
Vietnam
India
Asia

More Telugu News