Revanth Reddy: ప్రగతి భవన్.. కల్వకుంట్ల ప్రైవేటు లిమిటెడ్ కార్యాలయమా?: రేవంత్ రెడ్డి

revanth reddy slams kcr
  • కాంట్రాక్ట్‌ నర్సులను అన్యాయంగా తొలగించారు
  • వారిని కరోనా సమయంలో దేవుళ్లని పొగిడారు
  • స్టాఫ్ నర్సులు ఇయ్యాల రోడ్డున పడి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు
  • ప్రగతి భవన్.. ప్రజల కన్నీళ్లు తుడవాల్సిన ముఖ్యమంత్రి కార్యాలయమా కాదా?
కరోనా స‌మ‌యంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన తమను ఇప్పుడు ప్రభుత్వం అన్యాయంగా విధుల నుంచి తొలగించిందంటూ కాంట్రాక్ట్‌ నర్సులు నిన్న‌ హైదరాబాదులో డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తుండగా పోలీసుల దాష్టీకానికి పాల్ప‌డ్డారంటూ వ‌చ్చిన ఓ వార్త‌ను టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు.

ప్ర‌భుత్వ తీరు వ‌ల్ల త‌మ కుటుంబాలు రోడ్డున పడ్డాయని అందులో న‌ర్సులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ విషయంపై నర్సులు ఇప్ప‌టికే హెచ్‌ఆర్సీనీ ఆశ్రయించారు. తాజాగా, రేవంత్ రెడ్డిని కూడా క‌లిసి త‌మ త‌ర‌ఫున పోరాడాల‌ని కోరుతూ విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. దీనిపై స్పందిస్తూ ప్ర‌భుత్వంపై రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు.

'కరోనా సమయంలో దేవుళ్లని పొగిడిన స్టాఫ్ నర్సులు ఇయ్యాల రోడ్డున పడి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రగతి భవన్.. ప్రజల కన్నీళ్లు తుడవాల్సిన ముఖ్యమంత్రి కార్యాలయమా లేక, కల్వకుంట్ల ప్రైవేటు లిమిటెడ్ కార్యాలయమా కేసీఆర్? 1600 మంది స్టాఫ్ నర్సులను విధుల్లో కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాను' అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
Revanth Reddy
Congress
KCR

More Telugu News