Manirathnam: మహేశ్ తో సినిమాపై స్పందించిన మణిరత్నం!

Manirathnam says about Mahesh Babu movie
  • గొప్ప దర్శకుడిగా పేరు
  • సహజత్వానికి పెద్దపీట
  • పాత్రలను బట్టే నటీనటుల ఎంపిక
  • తెలుగులో చేయాలనుందన్న మణిరత్నం  
భారతదేశం గర్వించదగిన దర్శకులలో మణిరత్నం ఒకరు. కథను .. పాత్రలను తెరపై ఆయన ఆవిష్కరించే తీరు కొత్తగా .. వైవిధ్యంగా ఉంటుంది. సున్నితమైన భావాలను అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుడిగా ఆయనకి మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాల్లో సంభాషణలు .. సన్నివేశాలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఆయన తమిళంలోనే తెరకెక్కించినా, ఆ సినిమా వివిధ భాషల్లో విడుదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా ఆయన సినిమాలను ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు.

ప్రస్తుతం ఆయన 'పొన్నియిన్ సెల్వన్' అనే భారీ చారిత్రక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఆ మధ్య ఆయన మహేశ్ కి ఒక కథను చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. తాజా ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని గురించిన ప్రస్తావన రాగా, అది నిజమేనని ఆయన సమాధానమిచ్చారు. ఒక కథ విషయంలో మహేశ్ ను కలిసి మాట్లాడటం జరిగిందనీ, అయితే కొన్ని కారణాల వలన అది వర్కౌట్ కాలేదని అన్నారు. కథలను బట్టే తాను నటీనటులను ఎంపిక చేస్తూ ఉంటాననీ, నేరుగా తెలుగులో ఒక సినిమా చేసే ఆలోచన ఉందని ఆయన అన్నారు. మరి ఆ సమయం ఎప్పుడు వస్తుందో .. ఆ సందర్భం ఇప్పుడు కుదురుతుందో ఏమో!  
Manirathnam
Mahesh Babu
Tollywood

More Telugu News