Saba Karim: ధోనీ ధరించిన జెర్సీ-7కి వీడ్కోలు పలకండి: మాజీ ఆటగాడు సాబా కరీమ్

Dhonis Jersey no 7 should no be given to any one says Saba Karim
  • దిగ్గజాలు ధరించిన జెర్సీలకు గౌరవం ఇవ్వాలి
  • వారి జెర్సీ నంబర్లను ఇతర ఆటగాళ్లు వాడకుండా చర్యలు తీసుకోవాలి
  • భారత క్రికెట్ కు ధోనీ సేవలందిస్తాడని భావిస్తున్నా
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ జెర్సీ నంబర్-7ను ధరించిన సంగతి తెలిసిందే. జెర్సీ-7కు వీడ్కోలు పలకాలని టీమిండియా మాజీ ఆటగాడు సాబా కరీమ్ అన్నారు. మరి కొందరు దిగ్గజాలు ధరించిన జెర్సీలకు కూడా ఇదే గౌరవాన్ని ఇవ్వాలని అన్నారు. భారత క్రికెట్ దిగ్గజాలు ధరించిన జెర్సీ నంబర్లను ఇతర ఆటగాళ్లు వాడకుండా చూడాలని చెప్పారు. మన దేశ క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లిన దిగ్గజాలకు ఇదొక గుర్తింపని అన్నారు.

క్రికెట్ కు దూరమైనా యువకులకు మార్గనిర్దేశం చేయగల సత్తా ధోనీకి ఉందని సాబా కరీమ్ చెప్పారు. కుర్రాళ్లకు దారి చూపే దీపం మహీ అని అన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఎందరో యువకులను ధోనీ తీర్చిదిద్దాడని కొనియాడారు. భారత క్రికెట్ కు కూడా ధోనీ తన సేవలను అందిస్తాడని భావిస్తున్నానని అన్నారు. రాష్ట్ర స్థాయిలో కూడా కుర్రాళ్లకు ధోనీ మార్గనిర్దేశం చేయాలని... అలాగైతే భారత క్రికెట్ కు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.
Saba Karim
MS Dhoni
Team India
Jersey

More Telugu News