Varla Ramaiah: ప్రభుత్వ సలహాదారు సజ్జల రెండేళ్లుగా రాజకీయమే మాట్లాడుతున్నారు: వర్ల రామయ్య

Varla Ramaiah criticizes Sajjala on his political speeches
  • ఏపీ హైకోర్టు వ్యాఖ్యలపై వర్ల రామయ్య స్పందన
  • సజ్జల ప్రభుత్వ జీతం తీసుకుంటున్నారని వ్యాఖ్య 
  • జీతంగా తీసుకున్న డబ్బును రాబడతారా? అంటూ ప్రశ్న  
ప్రభుత్వ సలహాదారులు రాజకీయాలు మాట్లాడడం ఏమిటంటూ ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించడంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. ప్రభుత్వ సలహాదారులు పత్రికల్లో రాజకీయ విషయాలు మాట్లాడకూడదని హైకోర్టు వ్యాఖ్యానించిందని ఆయన పేర్కొన్నారు. కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి రెండేళ్లుగా రాజకీయమే మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ జీతం తీసుకుని ఆ విధంగా మాట్లాడరాదని హైకోర్టు చెప్పిందని, మరి రెండేళ్లుగా సజ్జల జీతంగా తీసుకున్న డబ్బును రాబడతారా ముఖ్యమంత్రిగారూ? అంటూ వర్ల రామయ్య ప్రశ్నించారు.
Varla Ramaiah
Sajjala Ramakrishna Reddy
Political
Govt Adviser
High Court
YSRCP
Andhra Pradesh

More Telugu News