Rajinikanth: చెన్నై చేరుకున్న రజనీకాంత్.. అభిమానుల ఘన స్వాగతం

Rajinikanth returns from USA
  • వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన రజనీకాంత్
  • 2016లో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించుకున్న తలైవా
  • 20 రోజుల తర్వాత చెన్నైకి చేరుకున్న రజనీ
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. హెల్త్ చెకప్ కోసం గత నెల 19న ప్రత్యేక అనుమతితో అమెరికాకు వెళ్లారు. 2016 మే నెలలో అమెరికాలో ఆయన కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్ కోసం ఆయన అమెరికాకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు కూడా యూఎస్ కు వెళ్లారు. అమెరికాలోని మయో క్లినికల్ ఆసుపత్రిలోని వైద్యులు ఆయనకు పరీక్షలు చేశారు. ఎలాంటి సమస్యలు లేవని వైద్యులు తెలిపారు. దాదాపు 20 రోజుల తర్వాత రజనీకాంత్ చెన్నై ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా రజనీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు.

మరోవైపు ప్రస్తుతం రజనీ 'అన్నాత్తే' సినిమాలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, నయనతార, కీర్తి సురేశ్, మీనా, ఖుష్బూ, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో తెలుగు నటుడు సత్యదేవ్ ఒక కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రజనీ చేయబోయే చిత్రానికి ఆయన కూతురు సౌందర్య దర్శకత్వం వహించనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.
Rajinikanth
USA
Chennai
Tollywood
Kollywood

More Telugu News