Bandla Ganesh: హీరోగా నటించనున్న బండ్ల గణేశ్?

Rumour on Bandla Ganesh
  • హాస్య నటుడిగా గుర్తింపు 
  • భారీ చిత్రాల నిర్మాతగా పేరు 
  • మళ్లీ నటన వైపుకు అంటూ టాక్ 
  • కథ వినిపించిన కొత్త దర్శకుడు
తెలుగు తెరకు బండ్ల గణేశ్ నటుడిగానే పరిచయమయ్యాడు. ఆ తరువాత నిర్మాతగా మారి, భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించాడు. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ తరువాత నిర్మాతగా సినిమాలకి దూరమైన ఆయన, 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ లో హఠాత్తుగా మెరిశాడు. ఆ తరువాత ఇకపై అలాంటి పాత్రలు చేయనని కూడా చెప్పాడు. కానీ ఇటీవల ఆయన నటన వైపు మొగ్గుచూపుతున్నాడనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

తమిళంలో యోగిబాబు ప్రధాన పాత్రధారిగా రూపొందిన 'మండేలా' తెలుగు రీమేక్ లో బండ్ల గణేశ్ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయనే స్వయంగా చెప్పాడు. ఇక ఇప్పుడు మళ్లీ అలాంటి టాక్ ఒకటి బలంగానే వినిపిస్తోంది. వెంకట్ అనే ఒక కొత్త దర్శకుడు ఒక కథను తయారుచేసుకున్నాడట. పూర్తి వినోదభరితంగా సాగే ఈ కథలో, ప్రధాన పాత్రను బండ్ల గణేశ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.  
Bandla Ganesh
Yogibabu
Venkat

More Telugu News