Nishit Pramanik: 35 ఏళ్లకే కేంద్ర మంత్రిగా నిషిత్ ప్రమాణ స్వీకారం.. మోదీ కేబినెట్‌లో అత్యంత పిన్నవయస్కుడు

  • పశ్చిమ బెంగాల్‌లోని దిన్హాతాకు చెందిన నిషత్
  • రాజకీయాల్లోకి రాకముందు ఎలిమెంటరీ స్కూల్ టీచర్
  • నాడు తృణమూల్ కాంగ్రెస్‌లో యువనేత
  • 2019లో బీజేపీలో చేరిక
Nisith Pramanik Find Cabinet Berths

కేంద్ర హోం, యువజన, క్రీడాశాఖ సహాయమంత్రిగా నిన్న ప్రమాణస్వీకారం చేసిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన నిషిత్ ప్రామాణిక్ రికార్డులకెక్కారు. 35 ఏళ్ల  నిషిత్.. మోదీ కేబినెట్‌లో అత్యంత పిన్నవయస్కుడైన మంత్రిగా గుర్తింపు సాధించారు.

17 జనవరి 1986లో పశ్చిమ బెంగాల్‌లోని దిన్‌హతాలో జన్మించిన నిషిత్ కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచ్‌లర్స్ డిగ్రీ అందుకున్నారు. తొలుత ఓ ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేశారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో యువనేతగా పనిచేశారు. 2019లో బీజేపీలో చేరిన ఆయన కోచ్ బిహార్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసి విజయం సాధించారు.
 
ఈ నియోజకవర్గంలో టీఎంసీకి గట్టి పట్టు ఉన్నప్పటికీ తన బలాన్ని నిరూపించుకున్నారు. టీఎంసీ అభ్యర్థి చంద్రా అధికారిపై దాదాపు 54 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో దిన్హతా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నిషిత్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే, అధిష్ఠానం ఆదేశాలతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

More Telugu News