Kolkata: కోల్‌కతాలో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం చేసి రూ. 15 లక్షల చోరీ

Kolkata Woman Gang Raped In Her Flat Robbed Of Rs 15 Lakh Cash
  • అపార్ట్‌మెంట్‌లో యువతి ఒంటరిగా ఉన్న సమయంలో దారుణం
  • అత్యాచారానికి ముందు యువతిని కట్టేసిన దుండగులు
  • పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
26 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు ఆపై రూ. 15 లక్షల నగదు దోచుకెళ్లిన ఘటన కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలో జరిగింది. మంగళవారం మధ్యాహ్నం అపార్ట్‌మెంట్‌లోని తన ఫ్లాట్ ‌లో యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణం జరిగింది. ఆమెపై అత్యాచారం జరిగినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. అత్యాచారానికి ముందు యువతిని కట్టేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. కోల్‌కతా డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
Kolkata
West Bengal
Gang Rape
Crime News

More Telugu News