దారుణ హత్యకు గురైన హైతీ దేశాధ్యక్షుడు
- ఆయన నివాసంలోనే కాల్చి చంపిన దుండగులు
- తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న అధ్యక్షుడి భార్య
- సమగ్ర దర్యాప్తు జరుగుతోందన్న తాత్కాలిక ప్రధాని
మరోవైపు అధ్యక్షుడు హత్యకు గురయ్యారనే వార్తతో ఆ దేశ ప్రజలు ఉలిక్కి పడ్డారు. దేశంలో హింస చెలరేగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించింది. దీంతో, అప్రమత్తమైన పోలీసులు, భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని తాత్కాలిక ప్రధాని తెలిపారు. హత్యపై సమగ్ర దర్యాప్తును జరుపుతున్నామని చెప్పారు. హైతీలో రాజకీయ, ఆర్థిక స్థిరత్వం దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో అక్కడ గ్యాంగ్ వార్ లు కూడా ఎక్కువయ్యాయి.