Kalayan Ram: 'డెవిల్' కోసం భారీ సెట్లు.. కోట్ల ఖర్చు!

Huge sets for Devil movie
  • భారీ బడ్జెట్ తో 'డెవిల్'
  • డిఫరెంట్ లుక్ తో కల్యాణ్ రామ్
  • బ్రిటీష్ కాలంలో నడిచే కథ
  • భారీ సెట్లకు సన్నాహాలు    
కల్యాణ్ రామ్ కథానాయకుడిగా రీసెంట్ గా 'డెవిల్' సినిమా టైటిల్ పోస్టర్ ను వదిలారు. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ కథ బ్రిటీష్ వారి కాలంలో నడుస్తుంది. బ్రిటీష్ వారి సీక్రెట్ ఏజెంట్ గా కల్యాణ్ రామ్ కనిపించనున్నాడు. ఆయన ఫస్టు లుక్ కి మంచి మార్కులు పడిపోయాయి. కథా పరంగా బ్రిటీష్ కాలం నాటి వాతావరణం .. ఆనాటి పరిస్థితులు .. వేషధారణ .. వాహనాలు .. వస్తువులు .. ఇలా ప్రతి విషయంలోను ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది.

ఈ సినిమా కోసం భారీ సెట్లు వేయిస్తున్నారట.. అందుకోసం భారీ మొత్తమే ఖర్చు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. దర్శకుడిగా నవీన్ మేడారం ఇంతకుముందు 'బాబు బాగా బిజీ' సినిమా చేశాడు.. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అయినా ఆయన భారీ బడ్జెట్ తో కూడిన ఈ సినిమాకి అభిషేక్ పిక్చర్స్ వారిని ఒప్పించాడంటే, కథలో విషయం ఉండే ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇక ఒక వైపున రాజుల చరిత్రతో 'బింబిసార' చేస్తున్న కల్యాణ్ రామ్, మరో వైపున బ్రిటీష్ వారి కాలంతో కూడిన 'డెవిల్' చేస్తుండటం విశేషం.
Kalayan Ram
Naveen Medaram
AAbhishek Pictures

More Telugu News