Amit Shah: మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ.. మోదీ నివాసానికి చేరుకున్న ప‌లువురు నేత‌లు

shah nadda reaches Lok Kalyan Marg ahead of Union Cabinet reshuffle
  • కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఆహ్వానం అందుకున్న ప‌లువురు నేత‌లు
  • వారితో పాటు మోదీ వ‌ద్ద‌కు అమిత్ షా, జేపీ న‌డ్డా
  • సాయంత్రం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో కొత్త మంత్రుల ప్ర‌మాణ స్వీకారోత్స‌వం
మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణపై కేంద్ర ప్ర‌భుత్వం అన్ని ఏర్పాటు పూర్తి చేసుకుంటోన్న విష‌యం తెలిసిందే. మంత్రి వ‌ర్గంలో కొత్త‌గా కొంద‌రికి అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఆహ్వానం అందుకున్న ప‌లువురు ప్ర‌ముఖులు ఢిల్లీలోని ప్రధాని నివాసానికి చేరుకున్నారు.

శోభ‌, క‌పిల్ పాటిల్, శ‌ర్బానంద సోనోవాల్, మీనాక్షి లేఖి, పురుషోత్తం రూపాలా, నిసిత్ ప్ర‌మాణిక్‌, ఆర్సీపీ సింగ్‌, ప‌శుప‌తి ప‌రాస్, అనుప్రియ ‌పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, భూపేంద్ర యాద‌వ్, త‌దిత‌రుల‌తో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్య‌క్షుడు జేపీ న‌డ్డా 7 లోక్‌క‌ల్యాణ్ మార్గ్ చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంట‌ల‌కు మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో కొత్త మంత్రుల ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది.

Amit Shah
Narendra Modi
BJP

More Telugu News