Twitter MD: అరెస్ట్ చేయబోమని స్పష్టం చేస్తేనే పోలీసుల ముందుకు వస్తా: ట్విట్టర్ ఇండియా ఎండీ 

Will come to police if they wont arrest me says Twitter India MD
  • ముస్లిం వృద్ధుడిపై దాడి చేసిన వీడియో వైరల్
  • నోటీసులు జారీ చేసిన యూపీ పోలీసులు
  • నోటీసులకు వ్యతిరేకంగా కర్ణాటక హైకోర్టులో మనీశ్ పిటిషన్
ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరిపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘజియాబాద్ లో ఓ ముస్లిం వృద్ధుడిపై దాడి చేశాడనే వీడియో వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు, మనీశ్ కు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు వ్యతిరేకంగా కర్ణాటక హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

యూపీ పోలీసులు తనను అరెస్ట్ చేయబోమని హామీ ఇస్తేనే... పోలీసుల ఎదుటకు వస్తానని కోర్టుకు తెలిపారు. తనపై చేయి వేయబోమని పోలీసులు కోర్టుకు అండర్ టేకింగ్ ఇవ్వాలని, అప్పుడు తాను వ్యక్తిగతంగా పోలీసుల ముందు హాజరవుతానని చెప్పారు. పోలీసు విచారణకు వర్చువల్ విధానం ద్వారా హాజరవుతానని మనీశ్ చేసిన విన్నపాన్ని యూపీ పోలీసులు తిరస్కరించిన సంగతి తెలిసిందే.
Twitter MD
Manish
Karnataka Hc
Petition

More Telugu News