Kanna Lakshminarayana: జగన్ చేతకానితనంతోనే సమస్య: కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం

AP bjp ex chief kanna slams Jagan over krishna waters row
  • కృష్ణా జలాల విషయంలో జగన్ మెతక వైఖరి
  • జగన్ చేతకాని తనాన్ని కేసీఆర్ అనుకూలంగా మార్చుకుంటున్నారు
  • నీటి వాటాల విషయంలో ఒక్క చుక్క అన్యాయం జరిగినా సహించం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న గుంటూరులో విలేకరులతో మాట్లాడిన కన్నా.. జగన్ చేతకానితనాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారని అన్నారు. కృష్ణా జలాల విషయంలో జగన్ మెతక వైఖరి అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌తో జగన్‌కు ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగా ఏపీ ప్రయోజనాలను బలి చేస్తున్నారని మండిపడ్డారు.  నీటి వాటాల విషయంలో ఏపీకి ఒక్క చుక్క అన్యాయం జరిగినా బీజేపీ సహించదని కన్నా హెచ్చరించారు.
Kanna Lakshminarayana
BJP
Jagan
KCR

More Telugu News