Sivaji Raja: శివాజీరాజాను ఈ విధంగా చూసి "ఆయనకు ఏమైంది?" అంటున్న అభిమానులు!

Sivaji Raja in a shocking look
  • గతేడాది గుండెపోటుకు గురైన శివాజీరాజా
  • అప్పటినుంచి మీడియాకు దూరం
  • శివాజీరాజా తనయుడు హీరోగా ఎంట్రీ
  • పాట విడుదల కార్యక్రమంలో కనిపించిన శివాజీరాజా
  • బక్కచిక్కి కనిపించిన నటుడు
టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరుతెచ్చుకున్న శివాజీరాజా అనేకమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే, శివాజీరాజా తాజా లుక్కు చూసి అభిమానులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. బాగా బక్కచిక్కి కనిపిస్తున్న తమ అభిమాన నటుడ్ని చూసి ఆవేదనకు గురవుతున్నారు. శివాజీరాజాకు ఏమైంది అంటూ ఆరా తీస్తున్నారు.

శివాజీరాజా 2020లో గుండెపోటుకు గురయ్యారు. అప్పటినుంచి ఆయన మీడియాకు దూరంగా ఉంటున్నారు. తాజాగా తన కుమారుడు వినయ్ రాజా నటిస్తున్న వేయి శుభములు కలుగునీకు చిత్రం నుంచి ఓ పాట విడుదల చేస్తుండగా, ఓ కార్యక్రమంలో శివాజీరాజా బలహీనంగా కనిపించారు. దీనిపై ఆయన సన్నిహితులు వివరణ ఇచ్చారు. గుండెపోటుకు గురయ్యాక చికిత్స పొందారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు.
Sivaji Raja
Look
Actor
Tollywood

More Telugu News