Polavaram Project: పోలవరం నిర్వాసితుల సమస్యలపై విపక్షాల నిరసన దీక్ష

Opposition parties conducts agitation for Polavaram expatriates
  • విజయవాడలో నిరసన దీక్ష
  • హాజరైన సీపీఐ, సీపీఎం, టీడీపీ నేతలు
  • నిర్వాసితులను తరిమేస్తున్నారని ఆగ్రహం
  • ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక
పోలవరం ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితుల సమస్యలు తీర్చాలంటూ ప్రతిపక్ష నేతలు విజయవాడలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో టీడీపీ, సీపీఐ, సీపీఎం, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ దీక్షలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, పోలవరం నిర్వాసితులను గ్రామాల నుంచి తరిమేస్తున్నారని ఆరోపించారు. నిర్వాసితుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

సీపీఎం అగ్రనేత మధు స్పందిస్తూ, 15 రోజల్లోగా నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 7న ముంపు మండలాల్లో నిరసన దీక్షలు చేపడుతున్నట్టు వెల్లడించారు. మాజీ ఎంపీ, రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ, పునరావాసం కల్పించకుండా నిర్వాసితులను ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
Polavaram Project
Expatraites
Agitation
Vijayawada
TDP
CPI
CPM

More Telugu News