Pawan Kalyan: రేపు విజయవాడ పర్యటనకు వస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్

Pawan Kalyan visits Vijayawada
  • రాష్ట్రంలో పవన్ పర్యటన ఖరారు
  • ఎల్లుండి జనసేన నేతలతో సమావేశం
  • రాష్ట్రంలో పరిస్థితులపై చర్చ
  • పార్టీ అంతర్గత వ్యవహారాలపైనా చర్చ
గత కొంతకాలంగా తన రాజకీయ కార్యకలాపాలను తగ్గించుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాజా పరిస్థితుల నేపథ్యంలో మునుపటిలా చురుగ్గా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ రేపు విజయవాడ పర్యటనకు రానున్నారు. ఎల్లుండి జులై 7న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన చర్చించనున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు, జాబ్ క్యాలెండర్ తదితర అంశాలపై అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. తిరుపతి ఉప ఎన్నిక అనంతరం పార్టీలోని అంతర్గత పరిస్థితులపైనా పవన్ దృష్టి సారించనున్నారు.
Pawan Kalyan
Vijayawada
Mangalagiri
Janasena
Andhra Pradesh

More Telugu News