Balanagar: ప్రారంభానికి సిద్ధమైన బాలానగర్ ఫ్లైఓవర్.. తీరనున్న వాహనదారుల కష్టాలు

KTR to open Balanagar Flyover tomorrow

  • రూ. 385 కోట్ల వ్యయంతో నిర్మాణం
  • 2017లో శంకుస్థాపన చేసిన కేటీఆర్
  • రేపు ప్రారంభించనున్న కేటీఆర్

హైదరాబాదులో అత్యంత ట్రాఫిక్ సమస్య కలిగిన ప్రాంతాల్లో బాలానగర్ ఒకటి. ఈ ప్రాంతాన్ని దాటుకుని వెళ్లాలంటే వాహనదారులకు నరకం కనపడుతుంటుంది. ఈ ప్రాంతంలో వందలాది పరిశ్రమలు ఉండటంతో.. అనునిత్యం వేలాది ఆటో ట్రాలీలు, లారీలు తిరుగుతుంటాయి. దీంతో, విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంటుంది. ఈ నేపథ్యంలో, వాహనదారుల కష్టాలకు చెక్ పెట్టేందుకు 2017లో బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ. 385 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ బ్రిడ్జి నిర్మాణం పనులు మూడున్నర ఏళ్ల వ్యవధిలో పూర్తయ్యాయి.
 
1.13 కి.మీ పొడవున్న ఈ ఫ్లై ఓవర్ ను 24 మీటర్ల వెడల్పు, 26 పిల్లర్లతో నిర్మించారు. ఆరు లేన్లతో నగరంలో నిర్మించిన తొలి ఫ్లై ఓవర్ ఇదే కావడం గమనార్హం. 2050 సంవత్సరం వరకు ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని దీన్ని నిర్మించారు. ఈ ఫ్లై ఓబర్ ను రేపు కేటీఆర్ ప్రారంభించబోతున్నారు. ఈ బ్రిడ్జికి బాబూ జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్ గా నామకరణం చేయనున్నారు.

  • Loading...

More Telugu News