YS Sharmila: 8న షర్మిల పార్టీ ఆవిర్భావ ప్రకటన.. షెడ్యూల్ ఇదీ!

YS Sharmila to Announce YSR Telangana Party On july 8th
  • పార్టీ వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
  • 8న బెంగళూరు నుంచి ఇడుపులపాయకు షర్మిల
  • ప్రత్యేక చాపర్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేటకు
  • పంజాగుట్టలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులు
తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు ఇది వరకే స్పష్టం చేసిన వైఎస్ షర్మిల ఈ నెల 8న పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటించనున్నారు. నిన్న తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో పార్టీ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 8న ఫిల్మ్‌నగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న కార్యక్రమంలో పార్టీ ఆవిర్భావ ప్రకటన ఉంటుందన్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలనను ప్రజలకు అందించేందుకు షర్మిల ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.

పార్టీ ఆవిర్భావ ప్రకటనకు ముందు 8న షర్మిల బెంగళూరు నుంచి ఇడుపులపాయ వెళ్తారు. అక్కడ తండ్రి వైఎస్సార్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించిన అనంతరం కడపకు చేరుకుని ప్రత్యేక చాపర్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట చేరుకుంటారు. అనంతరం పంజాగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని సభావేదికకు చేరుకుని వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ ప్రకటన చేస్తారు.
YS Sharmila
YSR
Telangana
Kadapa

More Telugu News