Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో జడ్పీ చైర్ పర్సన్‌గా తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి

Telangana woman Elected as ZP Chairperson in UP
  • యూపీ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ తరపున విజయం
  • జాన్పూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా ఎన్నిక
  •  సూర్యాపేట జిల్లాలోని రత్నవరం శ్రీకళారెడ్డి స్వగ్రామం
  • యూపీ యువకుడిని పెళ్లాడి అక్కడికి వెళ్లిపోయిన వైనం
ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించిన తెలంగాణ మహిళ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరానికి చెందిన శ్రీకళారెడ్డి గతంలో కోదాడ నియోజకవర్గ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తర్వాత ఆమెకు యూపీకి చెందిన వ్యక్తితో వివాహం కావడంతో ఆమె అక్కడికి వెళ్లిపోయారు. అనంతరం అక్కడ బీజేపీలో చేరారు.

ఇటీవల జరిగిన జిల్లా పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమె  జాన్పూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. కాగా, శ్రీకళారెడ్డి తండ్రి కీసర జితేందర్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే.
Uttar Pradesh
Telangana
Jaunpur
Suryapet District

More Telugu News