: ఎన్డీఏ వద్దు వామపక్షాలే ముద్దు: బాబు
ఎన్నికలకు పార్టీలన్నీ రంగం సిద్దం చేసుకుంటున్నాయి. పార్టీలన్నీ ఇప్పట్నుంచే మిత్రపక్షాలపై కార్యకర్తలకు స్పష్టత నిచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఎన్డీఏతో బరిలో దిగేది లేదని టీడీపీ అదినేత చంద్రబాబు స్పష్టం చేశారు. 2014 ఎన్నికలకు వామపక్షాలతో కలిసి వెళ్లే అవకాశం ఉందన్నారు. అయితే దీనిపై వామపక్షాలు ఇప్పుడే ముందుకు రావడంలేదని ఆయన అన్నారు. యూపీఏ బలం తగ్గుతున్నా ఎన్డీఏ బలం పెరగడం లేదని, రాజకీయాలంటే కుట్రలు కుతంత్రాలులా తయారైందని అక్షేపించారు. తెలంగాణ విషయంలో తమ తీర్మానాన్ని నేతలు స్పష్టంగా అర్ధం చేసుకోవాలని బాబు కోరారు.
లోకేష్ రాజకీయాల్లోకి వస్తానంటే స్వాగతిస్తామని, యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ విగ్రహం విషయంలో రాజకీయాలు జరిగాయన్నది అందరికీ తెలుసనీ, అయినా తాము సహకరించామని తెలిపారు. అవసరమైనప్పుడు అవిశ్వాసం పెడతామని, టీడీపీ నుంచి బయటికెళ్ళిపోయిన వారు పశువుల కంటే హీనం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.