హరీశ్ శంకర్ తో విజయ్ దేవరకొండ?

  • 'లైగర్' షూటింగులో విజయ్ దేవరకొండ
  • సుకుమార్ తో ప్రాజెక్టు వాయిదా
  • తెరపైకి హరీశ్ శంకర్ పేరు
  • త్వరలోనే రానున్న స్పష్టత    
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా .. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. మరికొన్ని రోజులు చిత్రీకరణ జరిపితే షూటింగు పార్టు పూర్తవుతుంది. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగును త్వరలో మొదలుపెట్టనున్నారు. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ దర్శకుడు సుకుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లవలసి ఉంది. కానీ ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది.

వాస్తవానికి 'పుష్ప' సినిమా పూర్తికాగానే విజయ్ దేవరకొండ ప్రాజెక్టును మొదలుపెట్టాలని సుకుమార్ అనుకున్నాడు. అయితే 'పుష్ప'ను రెండు భాగాలుగా చేయడంతో, సుకుమార్ ఇప్పట్లో ఖాళీ అయ్యే అవకాశాలు లేవు. అప్పటివరకూ విజయ్ దేవరకొండ వెయిట్ చేయలేడు. అందువలన ఆయన హరీశ్ శంకర్ తో ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు పేరు వినిపిస్తోంది. మరో వైపున పవన్ ప్రాజెక్టును పట్టాలెక్కించే సమయం కోసం హరీష్ శంకర్ వెయిట్ చేస్తున్నాడు. ఏం జరుగుతుందో చూడాలి మరి.


More Telugu News

Vijay Devarakonda Sukumar Harish Shankar