Mehreen Pirzada: ఇటీవలే నిశ్చితార్థం... అంతలోనే సంచలన ప్రకటన చేసిన మెహరీన్

Mehreen Pirzada makes sensational announcement
  • గత మార్చిలో భవ్య బిష్ణోయ్ తో  మెహరీన్ నిశ్చితార్థం
  • త్వరలోనే పెళ్లి అనుకుంటుండగా నిశ్చితార్థం రద్దు
  • ట్విట్టర్ లో వెల్లడించిన టాలీవుడ్ తార
  • ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకున్నామన్న మెహరీన్
టాలీవుడ్ లో కొద్దికాలంలోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మెహరీన్ పీర్జాదా ఇటీవలే నిశ్చితార్థం చేసుకుంది. కానీ అంతలోనే బాంబు పేల్చింది! హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య భిష్ణోయ్ తో తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్టు మెహరీన్ సంచలన ప్రకటన చేసింది. ఈ నిర్ణయం ఇద్దరం కలిసి తీసుకున్నామని, ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఇకపై తాను పూర్తిగా సినిమాల్లో కొనసాగుతానని వెల్లడించింది.

ఇప్పటినుంచి తనకు భవ్య బిష్ణోయ్ తో గానీ, అతడి కుటుంబీకులతో గానీ ఎలాంటి సంబంధం ఉండబోదని మెహరీన్ వివరణ ఇచ్చింది. గత మార్చిలో మెహరీన్, భవ్య బిష్ణోయ్ ల నిశ్చితార్థం జైపూర్ లో అత్యంత ఘనంగా జరిగింది. ఇక పెళ్లే తరువాయి అనుకుంటున్న సమయంలో మెహరీన్ నిశ్చితార్థం రద్దు విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది.
Mehreen Pirzada
Breakup
Engagement
Bhavya Bishnoi
Tollywood

More Telugu News