Sudheer Reddy: ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగవి... మాపై మాట్లాడే హక్కు లేదు: రేవంత్ పై సుధీర్ రెడ్డి ఫైర్

TRS MLA Sudheer Reddy fires on TPCC Chief Revanth Reddy
  • పార్టీ ఫిరాయింపుదారులను రాళ్లతో కొట్టాలన్న రేవంత్
  • మీడియా సమావేశంలో నిప్పులు చెరిగిన సుధీర్ రెడ్డి
  • రాజ్యాంగం ప్రకారమే నడుచుకున్నామని వెల్లడి
  • రేవంత్ వి స్వార్థరాజకీయాలని విమర్శలు
తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఎంపికైన అనంతరం దూకుడు పెంచిన రేవంత్ రెడ్డి... కాంగ్రెస్ టికెట్ పై గెలిచి వేరే పార్టీల్లోకి వెళ్లే వారిని రాళ్లతో కొట్టాలని పిలుపునివ్వడం తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగకు తమ గురించి మాట్లాడే హక్కులేదని విమర్శించారు. మాణికం ఠాగూర్ కు రూ.25 కోట్లు ఇచ్చి పీసీసీ పీఠాన్ని రేవంత్ కొనుక్కున్నారని సుధీర్ రెడ్డి ఆరోపించారు. మమ్మల్ని రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చిన నిన్నే చెప్పులతో కొట్టాలి అంటూ హెచ్చరించారు.

ఆయనవి స్వార్థ రాజకీయాలని విమర్శించారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. తాము రాజ్యాంగం ప్రకారమే టీఆర్ఎస్ లో విలీనం అయ్యామని సుధీర్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో మరో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కూడా పాల్గొన్నారు.
Sudheer Reddy
Revanth Reddy
TRS
Congress
Telangana

More Telugu News