Nisha: పెళ్లి ఊరేగింపులో పోరాట విద్యలు ప్రదర్శించి మతులు పోగొట్టిన నవ వధువు!

Tamilnadu girl performs martial arts in her wedding celebrations
  • తూత్తుకుడిలో ఇటీవల పెళ్లిచేసుకున్న నిషా
  • పెళ్లి ఊరేగింపులో యుద్ధ విద్యా విన్యాసాలు
  • సిలంబం విద్యలో ప్రావీణ్యం సంపాదించిన నిషా
  • మహిళల్లో ఆత్మరక్షణ పట్ల అవగాహన కలిగించే ప్రయత్నం
తమిళనాడుకు చెందిన నిషా అనే అమ్మాయి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. 22 ఏళ్ల నిషా పెళ్లికూతురు వేషధారణలో ప్రదర్శించిన మార్షల్ ఆర్ట్స్ నెటిజన్లను ఔరా అనిపిస్తున్నాయి. ఇటీవల నిషా వివాహం తూత్తుకుడిలో జరిగింది. పెళ్లి తర్వాత నిర్వహించే ఊరేగింపులో నిషా మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అన్నట్టు ఆమె తన మేనమామ రాజ్ కుమార్ ను పెళ్లాడింది. ఆ యుద్ధ విద్యలను ఆమెకు నేర్పింది రాజ్ కుమారే. ఇంకేముందు, గురువు సమక్షంలో పదుగురి మధ్య తన ప్రతిభను ప్రదర్శించి అందరినీ మెప్పించింది.

ముఖ్యంగా, సిలంబం అనే ప్రాచీన ఆత్మరక్షణ విద్యలో నిషా నిపుణురాలు. మహిళల్లో స్వీయ రక్షణ పట్ల చైతన్యం కలిగించేందుకు ఇలా పెళ్లి వేడుకల్లో పోరాట విద్యలు ప్రదర్శించానని నిషా చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. 
Nisha
Martial Arts
Wedding
Women Defence
Tamilnadu

More Telugu News